ఫైబర్‌ సిప్‌

ABN , First Publish Date - 2016-04-01T22:04:08+05:30 IST

కావలసిన పదార్థాలు : కివీ ఫ్రూట్‌ - ఒకటి, ఆరెంజ్‌ - ఒకటి, స్ట్రాబెర్రీలు - పది, పుదీనా - గార్నిష్‌ కోసం, ఐస్‌ముక్కలు - తగినన్ని.

ఫైబర్‌ సిప్‌

కావలసిన పదార్థాలు : కివీ ఫ్రూట్‌ - ఒకటి, ఆరెంజ్‌ - ఒకటి, స్ట్రాబెర్రీలు - పది, పుదీనా - గార్నిష్‌ కోసం, ఐస్‌ముక్కలు - తగినన్ని.
 
పోషకాలు : విటమిన్‌ ఇ, సి, ఎ, విటమిన్‌ బి1, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌, పొటాషియం
లభిస్తాయి.
 
హెల్త్‌ బెనిఫిట్స్‌ : కిడ్నీ రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. బరువును తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి
బలోపేతం అవుతుంది.

తయారీ విధానం :
కివీ, ఆరెంజ్‌, స్ట్రాబెర్రీ పండ్లను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని బ్లెండర్‌లో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత రెండు, మూడు ఐస్‌ముక్కలు చేర్చాలి. పుదీనాతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. ఈ డ్రింక్‌లో ఐరన్‌, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. వేసవి తాపాన్ని తీర్చడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

Updated Date - 2016-04-01T22:04:08+05:30 IST