ఖీమా సమోసా

ABN , First Publish Date - 2016-07-13T19:11:41+05:30 IST

కావలసిన పదార్థాలు: సమోసా కోసం: మైదా: రెండు కప్పులు, వెన్న: టేబుల్‌ స్పూను, ఉప్పు: సరిపడ, పెరుగు: ఒకటిన్నర స్పూను, నీళ్ళు: తగినంత ఖీమా కోసం: మటన్‌ లేదా చికెన్‌ ఖీమా: అరకిలో, నూనె: టేబుల్‌ స్పూను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు: కప్పు, అల్లం వెల్లుల్లి ముక్కలు: నాలుగు స్పూన్లు, కొత్తిమీర,

ఖీమా సమోసా

కావలసిన పదార్థాలు:  సమోసా కోసం: మైదా: రెండు కప్పులు, వెన్న: టేబుల్‌ స్పూను, ఉప్పు: సరిపడ, పెరుగు: ఒకటిన్నర స్పూను, నీళ్ళు: తగినంత
ఖీమా కోసం: మటన్‌ లేదా చికెన్‌ ఖీమా: అరకిలో, నూనె: టేబుల్‌ స్పూను, సన్నగా తరిగిన ఉల్లిపాయలు: కప్పు, అల్లం వెల్లుల్లి ముక్కలు: నాలుగు స్పూన్లు, కొత్తిమీర, పుదీనా ఆకులు: కొన్ని, పచ్చిమిరపకాయలు: రెండు, స్ర్పింగ్‌ ఆనియన్స్‌: రెండు స్పూన్లు, పసుపు: చిటికెడు, కారం: తగినంత, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, గరంమసాలా పొడి: అర టీస్పూను, ఉప్పు: తగినంత, పంచదార: చిటికెడు, నూనె: తగినంత.
తయారీ విధానం: మైదాపిండిలో పెరుగు, వెన్న కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు పోసి మెత్తగా కలిపి దాని మీద తడిబట్ట వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఖీమాను శుభ్రం చేసి పెట్టుకున్న తరువాత బాండీలో నూనె పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. అనంతరం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి మరికొంత సేపు వేయించి ఆ తరువాత ఖీమా వేసి కొద్దిగాఉప్పు వేసుకొని కొద్దిగా నీరు పోసి మెత్తగా ఉడికించాలి. నీరంతా ఇంకిపోయి మెత్తగా గుజ్జుగా అయిన తరువాత అందులో జీలకర్రపొడి, గరంమసాలా పొడి, కొద్దిగా చక్కెర కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి మరికొద్దిసేపు పొయ్యి మీద ఉంచి దింపేయాలి. ఇప్పుడు పిండిని చపాతీలాగా పలుచగా వత్తుకుని అందులో ఖీమా మిఽశ్రమాన్ని పెట్టి త్రిభుజాకారంలో మడుచుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తరువాత నూనెలో ఒక్కొక్కటి చొప్పున వేయించుకోవాలి.

Updated Date - 2016-07-13T19:11:41+05:30 IST