కార్న్ చికెన్ కచోరి

ABN , First Publish Date - 2016-10-24T17:15:05+05:30 IST

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు, చికెన్‌- 150 గ్రా., స్వీట్‌కార్న్‌- రెండు కప్పులు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు,

కార్న్ చికెన్ కచోరి

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు, చికెన్‌- 150 గ్రా., స్వీట్‌కార్న్‌- రెండు కప్పులు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు, సోయా సాస్‌- 50 గ్రా., బ్రెడ్‌ తురుము- ఒక కప్పు, వెన్న- పావు కప్పు, మైదా- అర కప్పు, కోడిగుడ్లు- 2, నూనె- వేగించడానికి సరిపడా.
 
తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా చిదుముకోవాలి. దాంట్లో చికెన్‌, స్వీట్‌కార్న్‌, కొత్తిమీర తురుము, సోయాసాస్‌, వెన్న, మైదా వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని కోడిగుడ్ల సొనలో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బ్రెడ్‌ తురుములో దొర్లించి నూనెలో వేగించుకోవాలి.

Updated Date - 2016-10-24T17:15:05+05:30 IST