అంజీర్‌, ఖర్జూరం రోల్‌

ABN , First Publish Date - 2016-09-07T20:32:58+05:30 IST

కావలసిన పదార్ధాలు: అంజీర్‌ - 20, గింజల్లేని ఖర్జూరాలు - ఒకటిన్నర కప్పు, బాదం, జీడిపప్పు పలుకులు - రెండూ కలిపి అరకప్పు, యాలకుల పొడి - కొద్దిగా, కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, పల్చని ప్లాస్టిక్‌ కవర్లు - కొన్ని

తయారీ పద్ధతి:
అంజీర్‌ ముక్కల్ని గంట ముందు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఖర్జూరాలను ముక్కల్లా కోసుకోవాలి. నానబెట్టిన అంజీర్‌లను నీళ్ళు లేకుండా తీసుకుని మిక్సీలో వేసి మిశ్రమంలా చేసుకోవాలి. తరువాత ఖర్జూరం ముక్కల్ని కూడా వేసుకుని మెత్తని మిశ్రమంలా గ్రైండ్‌ చేసుకోవాలి. జీడిపప్పూ, బాదం పలుకుల్లో సగం విడిగా తీసుకుని ఖర్జూర మిశ్రమంలో కలపాలి. అలాగే కొబ్బరిపొడి, యాలకుల పొడిని కూడా ఖర్జూర మిశ్రమంలో వేసుకుని బాగా కలిపితే గట్టి ముద్దలా అవుతుంది. ఇప్పుడు ఖర్జూర మిశ్రమాన్ని తీసుకుని ప్లాస్టిక్‌ కవర్‌పై ఉంచి చేత్తో చిన్నసైజు చపాతీలా తట్టాలి. ఇందులో బాదం, జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా వేసి రోల్‌లా చుట్టేయాలి. ఇదేవిధంగా మిగిలిన మిశ్రమాన్నీ చేసుకోవాలి. ఈ రోల్స్‌ని ఓ రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఆ తరువాత అలాగే తీసుకోవచ్చు. లేదంటే చక్రాల్లా కోసినా చూడ్డానికి బాగుంటుంది.

Updated Date - 2016-09-07T20:32:58+05:30 IST