Advertisement
Advertisement
Abn logo
Advertisement

చికెన్‌ ఖీమా పిజ్జా

అడపాదడపా పిజ్జా తినకపోతే నోరు ఏదోలా ఉంటుంది. అవును మరి. ఎన్నో వెరైటీ పిజ్జాలు బేకరీల్లో నోరూరించేస్తూ ఉంటే నోరు కట్టేసుకోవటం కష్టమే. అలాగని వాటిని లాగించేస్తే బోలెడన్ని క్యాలరీలు ఒంట్లో చేరిపోయి లావెక్కటం ఖాయం. ఈ సమస్యలకు చక్కని పరిష్కారం...ఇంట్లోనే రుచి కరంగా, పుష్టినిచ్చేలా పిజ్జాలు తయారు చేసుకోవడమే! పోషకాలతో నిండిన, ఆరోగ్యకరమైన ఈ హోమ్‌మేడ్‌ పిజ్జా పరోటాలు బేకరీల్లో దొరికే పిజ్జాలకు ఏ మాత్రం తీసిపోవు. ఓసారి ట్రై చేసి చూడండి. 
 
కావలసిన పదార్థాలు
 
ఫిల్లింగ్‌ కోసం: చికెన్‌ ఖీమా - 3/4 కప్పు, ఉల్లి ముక్కలు - అర కప్పు, టమాటా ముక్కలు - అర కప్పు, వెల్లుల్లి తరుగు - 2 టీస్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీస్పూను, నూనె - 3 టే.స్పూన్లు, కారం - 1 టీస్పూను, పసుపు - కొద్దిగా, గరం మసాలా - 1 టీస్పూను, ఉప్పు - తగినంత
పిండి ముద్ద కోసం: గోధుమ పిండి - 3/4 కప్పు, నూనె - 2 టీస్పూన్లు, నీళ్లు - పిండికి సరిపడా
 
తయారీ విధానం
 
పిండికి ఉప్పు, తగినన్ని నీళ్లు చేర్చి పిసుక్కోవాలి. పిండి ముద్దను 8 సమ భాగాలుగా చేసుకుని చదునుగా చేసి పక్కనుంచాలి. ఫిల్లింగ్‌ తయారీ కోసం...నాన్‌ స్టిక్‌ ప్యాన్‌లో నూనె వేడి చేసి, వెల్లుల్లి ముక్కలు వేయించాలి. అవి గోధుమ రంగుకి మారిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత చికెన్‌ ఖీమా వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి మూత ఉంచి నీళ్లు ఇగిరిపోయేవరకూ ఉడికించాలి.తర్వాత టమాటా ముక్కలు వేసి మరో 7-8 నిమిషాలపాటు ఉడికించాలి.
నీరంతా ఇగిరిపోయి పొడిగా మారేవరకూ మూత ఉంచి ఉడికించాలి. ఇప్పుడు పిండి ముద్దలను పరోటాల్లా గుండ్రంగా ఒత్తుకోవాలి. చదునైన పీట మీద పరోటా ఉంచి లోపల ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఫిల్లింగ్‌ సమానంగా పరచాలి. దాని పైన మరో పరోటా ఉంచి అంచులు వేళ్లతో లోపలికి ఒత్తేయాలి. ప్యాన్‌ వేడి చేసి 1 టీస్పూను నూనె వేసి పరోటాలను మద్యస్థమైన మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. పిజ్జా పరోటా రెడీ అయ్యాక కత్తితో నాలుగు భాగాలుగా కోసి చిల్లీ సాస్‌తో వేడిగా వడ్డించాలి.

‘ఖాందేవ్‌’ సమస్యల పరిష్కారానికి కృషిఈయేడూ.. మూత‘బడి’! ట్రస్మా సభ్యుల నిరసన ఎన్టీఆర్‌కు ఘన నివాళిబుగ్గ పుణ్యక్షేత్రంలో ఆదివాసీల జలాభిషేక పూజలు చప్రాలకు పాదయాత్రగా తరలిన భక్తులుకలవరం! సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంట్రెంచు పనులను అడ్డుకున్న గ్రామస్తులుప్రాణహిత తీరం... శోక సంద్రం
Advertisement