Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీట్‌రూట్‌ పిజ్జా

కావలసిన పదార్థాలు
 
బీట్‌రూట్‌ తరుగు - 1 కప్పు, ఉల్లి ముక్కలు - అర కప్పు, పన్నీర్‌ ముక్కలు - 3/4 కప్పు, జీలకర్ర పొడి - 1 టీస్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, గోధుమ పిండి - 1 కప్పు, నూనె - 1 టేబుల్‌ స్పూను, కారం - అర టీస్పూను, నెయ్యి - వేపుడుకు సరిపడా.
 
తయారీ విధానం
 
బీట్‌రూట్‌ తరుగుకు ఉప్పు చేర్చి మూత ఉంచి మెత్తగా ఉడికించాలి. దీనికి ఉల్లి ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కారం, పన్నీర్‌, ఉప్పు చేర్చి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నాలుగు సమ భాగాలుగా చేసుకోవాలి. గోధుమ పిండికి నూనె, ఉప్పు, నీళ్లు చేర్చి ముద్దగా పిసుక్కోవాలి.
సమ భాగాలుగా చేసుకుని ఒక్కో పిండి ముద్దను పరోటాగా ఒత్తుకోవాలి. ఈ పరోటాలో ఉడికించి పెట్టుకున్న బీట్‌రూట్‌ మిశ్రమాన్ని ఉంచి పైన మరో పరోటా ఉంచి అంచులు మూసేయాలి. నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ వేడి చేసి, నెయ్యి వేసి, పిజ్జా పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. వేడిగా టమాటా సాస్‌తో వడ్డించాలి.

ఫీవర్‌సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ పకడ్బందీగా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌ఆదివాసీలను మభ్యపెడుతున్న ప్రభుత్వం చైర్మన్‌ గురిపై గురికుంరం భీం జిల్లా బీజేపీలో ముసలం ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలిఆదివాసీలు దేవతలకు పూజలుఫిబ్రవరి 20న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నికకాగజ్‌నగర్‌లో దుర్గంధంగా ఎస్‌బీఐ ఏటీఎం
Advertisement