పుదీనా చికెన్‌

ABN , First Publish Date - 2018-02-24T23:33:51+05:30 IST

చికెన్‌ - 400 గ్రా, పుదీనా - 2 కప్పులు, కొత్తిమీర తరుగు - 1/2 కప్పు, అల్లం - చిన్నముక్క...

పుదీనా చికెన్‌

కావలసిన పదార్థాలు
 
చికెన్‌ - 400 గ్రా, పుదీనా - 2 కప్పులు, కొత్తిమీర తరుగు - 1/2 కప్పు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - 6, పచ్చిమిర్చి- 1, పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, గరంమసాలా- 1 టీ స్పూను, పసుపు - 1/2 టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 4 స్పూన్లు, నిమ్మకాయ - 1.
 
తయారుచేసే విధానం
 
పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పేస్టుచేసి పక్కన పెట్టుకోండి. దీనికి పసుపు, గరంమసాలా, ఉప్పు, పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు పట్టించి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. ఒక పాన్లో నూనె వేసి కాగిన తరువాత ముక్కలను వెయ్యండి. రెండువైపులా సమానంగా వేగిన పుదీనా చికెన్‌ను ప్లేట్లో తీసుకుని పైన తరిగిన కొత్తిమీర వేసి, నిమ్మరసం పిండండి. దీన్ని స్నాక్‌లా లేదా స్టార్టర్‌లా తీసుకుంటే చాలా బాగుంటుంది.

Updated Date - 2018-02-24T23:33:51+05:30 IST