పీతల కూర

ABN , First Publish Date - 2018-01-20T21:51:15+05:30 IST

పీతలు- ఐదు, కశ్మీరీ మిర్చి- ఎనిమిది, మిరప పేస్టు- ఒక టేబుల్‌స్పూను, గోవా చిల్లీ-ఏడు, కొబ్బరితరుగు...

పీతల కూర

కావలసినవి
 
పీతలు- ఐదు, కశ్మీరీ మిర్చి- ఎనిమిది, మిరప పేస్టు- ఒక టేబుల్‌స్పూను, గోవా చిల్లీ-ఏడు, కొబ్బరితరుగు- ఒక కప్పు, వెల్లుల్లి- పదిహేను రెబ్బలు, అల్లం-కొద్దిగా, లవంగాలు-12, ధనియాలు, జీలకర్ర,దాల్చినచెక్క- ఒక్కొక్కటి ఒక్కో టేబుల్‌స్పూను, బ్లాక్‌ పెప్పర్‌ కార్న్‌-12, పసుపు- ఒక టీస్పూను, ఉప్పు-తగినంత, నూనె- ఒక టేబుల్‌స్పూను, నీళ్లు- అర కప్పు, వెనిగర్‌-మూడు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు-2 (సన్నగా తరిగి), చింతపండురసం-3 టేబుల్‌స్పూన్లు, బెల్లం-రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- ఒక టీస్పూను, చిక్కటి కొబ్బరిపాలు-రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
డ్రై రోస్టింగ్‌కి కావలసినవి 
పాన్‌ తీసుకుని అందులో కశ్మీరీ మిర్చి, గోవా మిర్చి, కొబ్బరి తురుము, అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, ధనియాలు, దాల్చినచెక్క, బ్లాక్‌ పెప్పర్‌ కార్న్స్‌ పసుపు వేయాలి.
మొదట కశ్మీరీ మిర్చిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. తర్వాత మిర్చిలో ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి. మిర్చి మెత్తగా అయిన తర్వాత అందులో డ్రై మసాలా దినుసులు అన్నీ వేయాలి. ఈ మసాలాలో కొద్దిగా నూనె, నీళ్లు, వెనిగర్‌ వేసి అన్నీ కలిసిపోయేలా మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
 
కర్రీకి
పాన్‌లో నూనె వేడిచేసి అందులో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయల్ని వేయాలి. వేగిన ఉల్లిపాయల్లో మసాలా పేస్టును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టిన తర్వాత మూడు టేబుల్‌స్పూన్ల చింత పండు రసాన్ని అందులో వేయాలి. దానికి తగ్గపాళ్లల్లో బెల్లం కూడా అందులో వేయాలి. ఆ మిశ్రమంలో పీతలు కలిపి కొద్దిగా ఉప్పు వేయాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడకనివ్వాలి. పాన్‌ తీసుకుని అందులో నూనె, మిర్చిపేస్టు వేసి కలిపి పీతల్లో ఆ మిశ్రమాన్ని వేయాలి. తర్వాత ఐదు టీస్పూన్ల చింతపండురసం, బెల్లం, నిమ్మరసం అందులో వేసి మూతపెట్ట్లి కాసేపు సన్నటి సెగపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత పీతలనన్నింటినీ బయటకు తీసి కర్రీలో ఒక స్పూను చిక్కని కొబ్బరి పాలను కలపాలి. అందులో పీతలు వేయాలి. వాటితోపాటు కొద్దిగా నిమ్మరసం కూడా కలిపితే పీతల కర్రీ రెడీ. వేడి వేడిగా అన్నంలోకి వడ్డించుకుని తింటే ఎంతో బాగుంటుంది.

Updated Date - 2018-01-20T21:51:15+05:30 IST