ఫ్రూట్‌ అండ్‌ నట్‌ యోగర్ట్‌

ABN , First Publish Date - 2018-05-31T00:00:25+05:30 IST

పెరుగు - ఒక కప్పు, యాలకల పొడి - చిటికెడు, అరటిపండు ముక్కలు - అర కప్పు, మామిడి ముక్కలు

ఫ్రూట్‌ అండ్‌ నట్‌ యోగర్ట్‌

కావలసిన పదార్థాలు
 
పెరుగు - ఒక కప్పు, యాలకల పొడి - చిటికెడు, అరటిపండు ముక్కలు - అర కప్పు, మామిడి ముక్కలు - అర కప్పు, ఆపిల్‌ ముక్కలు - పావు కప్పు, దానిమ్మ గింజలు - పావు కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పుల తరుగు - పావు కప్పు, తేనె - 2 టీ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
పెరుగులో యాలకుల పొడి కలిపి గిలకొట్టండి. గాజు గ్లాసుల్లో పళ్లముక్కలు, గిలకొట్టిన పెరుగు, కొద్దిగా తేనె ఒకదాని తరువాత ఒకటిగా వేసి పైన నట్స్‌ చల్లండి. దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టి సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే కూడా రోజంతటి అలసట చిటికెలో మాయమైపోతుంది.

Updated Date - 2018-05-31T00:00:25+05:30 IST