జింజర్‌ ప్రాన్స్

ABN , First Publish Date - 2018-08-12T15:57:26+05:30 IST

రొయ్యలు : 200గ్రాములు, ఉల్లిపాయ పేస్టు : ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు : అర కప్పు..

జింజర్‌ ప్రాన్స్

కావలసిన  పదార్థాలు
 
రొయ్యలు : 200గ్రాములు, ఉల్లిపాయ పేస్టు : ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు : అర కప్పు
ఉప్పు : తగినంత, మిరియాల పొడి : టీ స్పూన్, కారం : రెండు టీ స్పూన్లు, నూనె : డీప్‌ ఫ్రైకి సరిపడా, టమోటా సాస్‌ : టీ స్పూన్, సోయా సాస్‌ : టీ స్పూన్, ఫుడ్‌ (రెడ్‌) కలర్‌ : చిటికెడు, కొత్తిమీర తరుగు : రెండు టీ స్పూన్లు
 
తయారీ విధానం
 
ముందుగా రొయ్యలు శుభ్రం చేసి వేడి నీటితో కాస్త ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పానలో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత గ్లాస్‌ నీరు పోసి ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడేటప్పుడు టమోటా సాస్‌, సోయా సాస్‌, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. ఇందులో ఉడికించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. దోరగా వేయించిన జిం జర్‌ ప్రానను సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.

Updated Date - 2018-08-12T15:57:26+05:30 IST