బొమ్మిడాయిల పులుసు

ABN , First Publish Date - 2018-07-09T18:09:44+05:30 IST

శుభ్రం చేసిన బొమ్మిడాయిలు - అరకేజీ, ఉప్పు, కారం, పసుపు - సరిపడా, ఉల్లి తరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 4, కరివేపాకు - 4 రెబ్బలు, టమోటా తరుగు - పావు కప్పు,

బొమ్మిడాయిల పులుసు

కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన బొమ్మిడాయిలు - అరకేజీ, ఉప్పు, కారం, పసుపు - సరిపడా, ఉల్లి తరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 4, కరివేపాకు - 4 రెబ్బలు, టమోటా తరుగు - పావు కప్పు, చింతపండు గుజ్జు - పావు కప్పు, ధనియాల పొడి, జీరాపొడి - ఒక్కో టీ స్పూను చొప్పున, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు. నీరు - అరకప్పు.
 
తయారుచేసే విధానం: ఒక పాత్రలో బొమ్మిడాయిలు, (కొద్దిగా) ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, టమోటా తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తరుగు మెత్తబడ్డాక బొమ్మిడాయిలు, ధనియాల పొడి, జీరాపొడి కలిపి 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, నీరు పోసి మూత పెట్టి చిన్న మంటపై (కలపకుండా) ఉంచాలి. పులుసు చిక్కబడ్డాక రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొత్తిమీర చల్లి రెండు నిమిషాల తర్వాత మంట తీసెయ్యాలి.

Updated Date - 2018-07-09T18:09:44+05:30 IST