మిక్స్‌డ్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2018-09-08T19:46:59+05:30 IST

పెసర మొలకలు - అరకప్పు, కార్న్‌ఫ్లేక్స్‌ - అరకప్పు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు - ఒక్కొక్కటీ...

మిక్స్‌డ్‌ సలాడ్‌

కావలసినవి
 
పెసర మొలకలు - అరకప్పు, కార్న్‌ఫ్లేక్స్‌ - అరకప్పు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు - ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - చిన్నది (సన్నని ముక్కలుగా తరిగి), కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉప్పు - సరిపడా, నిమ్మరసం - సరిపడా. కీరదోస ముక్కలు, కొబ్బరి తరుగు - ఒక్కొక్కటి టేబుల్‌ స్పూను ( కావాలనుకుంటే).
 
తయారీవిధానం
 
పెసలను బాగా కడిగి మరిగించి చల్లార్చిన నీళ్లల్లో ఎనిమిది గంటలు నాననివ్వాలి. నానిన పెసలను నీళ్లల్లోంచి తీసి మంచినీటితో శుభ్రంగా కడగాలి. వాటిని తేమ ఉన్న ముస్లిన్‌లో గాని లేదా చీజ్‌ రాసిన గుడ్డలోగాని పెట్టి ముడివేయాలి. దాన్ని ఒక గిన్నెలో పెట్టి సగం మేర మూత పెట్టాలి. చీకటి గదిలో దీన్ని ఉంచాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి గుడ్డలోని పెసర్లకు మొలకలు వస్తాయి. పెసర్లు చుట్టిన గుడ్డ పొడారిపోతే దాని మీద నీళ్లు చిలకరిస్తుండాలి. ఇలా చేయడం వల్ల వాటికి తేమ తగిలి మొలకలు వస్తాయి. ఆరు గంటల నుంచి రెండు రోజుల్లో పెసర్లకు మొలకలు వస్తాయి. ఆ తర్వాత మిగతా అన్ని పదార్థాలను పెసర మొలకల్లో కలిపితే సలాడ్‌ రెడీ.

Updated Date - 2018-09-08T19:46:59+05:30 IST