పెసరపప్పుతో కోశాంబరి

ABN , First Publish Date - 2018-11-10T18:19:33+05:30 IST

నానబెట్టి వడపోసిన పెసరపప్పు, కీరా,క్యారెట్‌ తరుగు, దానిమ్మగింజలు, యాపిల్‌ముక్కలు...

పెసరపప్పుతో కోశాంబరి

కావలసినవి
 
నానబెట్టి వడపోసిన పెసరపప్పు, కీరా,క్యారెట్‌ తరుగు, దానిమ్మగింజలు, యాపిల్‌ముక్కలు, అల్లం, పచ్చిమిర్చిముక్కలు, కొబ్బరి కోరు, ఉసిరి ముక్కలు, నిమ్మచెక్కలు, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, పోపు గింజలు, ఇంగువ, వేగించడానికి సరిపడా నూనె.
 
తయారీ విధానం
 
పాన్‌లో కొద్దిగా నూనె పోయాలి. వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయల పోపు వేయాలి. అందులోనే కాస్త ఇంగువ కూడా వేయాలి.
పోపుతోపాటు కొబ్బరికోరును పచ్చివాసన పోయేలా బాగా వేగించి చల్లారనివ్వాలి.
నీళ్లల్లో అర కప్పు పెసరపప్పును నానబెట్టి వడగట్టాలి. నానిన పెసరపప్పును ఒక బౌల్‌లో పోసి అందులో కీర దోసకాయ తరుగు, క్యారెట్‌ తరుగు, ఉసిరికాయ ముక్కలు (మామిడి ముక్కలను కూడా వేసుకోవచ్చు), చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ బౌల్‌లో వేయాలి. ఈ మిశ్రమంపై కొద్దిగా ఉప్పు, కారం, దానిమ్మ గింజలు, యాపిల్‌ ముక్కలు వేయాలి. ఇంట్లో ఇతర పండ్లు ఉంటే వాటి ముక్కల్ని కూడా ఇందులో కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని స్పూనుతో బాగా కలపాలి.
అందులో వేగించి చల్లార్చిన కొబ్బరిని వేయాలి. ఒక నిమ్మచెక్కను అందులో పిండి బాగా కలపాలి. దానిమ్మ గింజలు, రెడీగా పెట్టుకున్న కొత్తిమీర తరుగును దాంట్లో వేసి కలపాలి. పండ్లతోనే కాదు పప్పు ధాన్యాలతో కూడా ఇలా సలాడ్‌ టైపులో చేసుకోవచ్చు.
ఈ పెసరపప్పు సలాడ్‌ కార్తిక మాసం స్పెషల్‌.

Updated Date - 2018-11-10T18:19:33+05:30 IST