కావలసిన పదార్థాలు
కీరదోస- 2 పెద్దవి (రౌండ్గా కట్ చేయాలి), తరిగిన ఉల్లిపాయ- పావు కప్పు, యోగర్ట్ - పావు కప్పు, నిమ్మరసం- కొద్దిగా, వెనిగర్- పావు కప్పు, ఉప్పు, మిరియాల పొడి- రుచికి సరిపడా, తురిమిన వెల్లుల్లి (కావాలనుకుంటే).
తయారీవిధానం
ఒక గిన్నెలో పై పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. గిన్నెను ఫ్రిజ్లో అరగంట పాటు పెట్టాలి.
తినేముందు ఈ మిశ్రమానికి కొద్దిగా తేనెగానీ, చక్కెరగానీ కలపొచ్చు. దీనివల్ల సలాడ్ తియ్యగా, రుచిగా ఉంటుంది.