మజ్జిగ

ABN , First Publish Date - 2019-04-13T14:27:00+05:30 IST

పెరుగు - ఒక కప్పు, నీళ్లు - ఒకకప్పు, అల్లం - ఒక టీస్పూన్‌ (మెత్తగా దంచుకోవాలి), పచ్చిమిర్చి..

మజ్జిగ

కావలసిన పదార్థాలు
పెరుగు - ఒక కప్పు, నీళ్లు - ఒకకప్పు, అల్లం - ఒక టీస్పూన్‌ (మెత్తగా దంచుకోవాలి), పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కొంచెం, ఉప్పు - తగినంత, నూనె - టీస్పూన్‌, ఆవాలు - అరటీస్పూన్‌, ఇంగువ - చిటికెడు.
 
తయారుచేయు విధానం
పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, ఒక కప్పు నీళ్లు పోసి బాగా మిక్సీ పట్టాలి. దీన్ని ఒకపాత్రలోకి తీసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్నాక ఇంగువ వేసుకొని స్టవ్‌ ఆపేయాలి. అందులో మజ్జిగను పోయాలి. చల్లదనం కోసం ఐస్‌క్యూబ్‌లు వేసుకోవచ్చు.

Updated Date - 2019-04-13T14:27:00+05:30 IST