మ్యాంగో కుల్ఫీ

ABN , First Publish Date - 2019-05-11T16:50:29+05:30 IST

పాలు - నాలుగున్నర కప్పులు, కస్టర్డ్‌ పౌడర్‌ - రెండు టేబుల్‌స్పూన్‌లు, కోవా - పావు కప్పు, పంచదార - పావు కప్పు, క్రీమ్‌ - అరకప్పు, మ్యాంగో ప్యూరీ - కప్పు.

మ్యాంగో కుల్ఫీ

కావలసినవి
 
పాలు - నాలుగున్నర కప్పులు, కస్టర్డ్‌ పౌడర్‌ - రెండు టేబుల్‌స్పూన్‌లు, కోవా - పావు కప్పు, పంచదార - పావు కప్పు, క్రీమ్‌ - అరకప్పు, మ్యాంగో ప్యూరీ - కప్పు.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో నాలుగు కప్పుల పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. మిగిలిన అరకప్పు పాలలో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి ఉండలు లేకుండా కలపాలి. పాలను చిన్న మంటపై అరగంట పాటు మరిగించుకోవాలి. తరువాత పంచదార, కస్టర్డ్‌ పౌడర్‌ మిశ్రమం వేసి మరికాసేపు ఉంచాలి. తరువాత కోవా వేసి మరికాసేపు ఉడికించుకొని దింపుకోవాలి. మిశ్రమం చల్లారాక క్రీమ్‌, మ్యాంగో ప్యూరీ వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌ల్లో లేక చిన్న గ్లాసుల్లో పోసి ఫ్రిజ్‌లో 6 నుంచి 8 గంటల పాటు పెట్టుకొని, తరువాత సర్వ్‌ చేయాలి.

Updated Date - 2019-05-11T16:50:29+05:30 IST