మ్యాంగో ఐస్‌క్రీమ్‌

ABN , First Publish Date - 2019-05-11T16:49:24+05:30 IST

పాలు - కప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మామిడిపండు - ఒకటి, మ్యాంగో ప్యూరీ - కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ - టేబుల్‌ స్పూన్‌, వెనీలా - టేబుల్‌ స్పూన్‌, పంచదార - కప్పు.

మ్యాంగో ఐస్‌క్రీమ్‌

కావలసినవి
 
పాలు - కప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మామిడిపండు - ఒకటి, మ్యాంగో ప్యూరీ - కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ - టేబుల్‌ స్పూన్‌, వెనీలా - టేబుల్‌ స్పూన్‌, పంచదార - కప్పు.
 
తయారీవిధానం
 
పావు కప్పు పాలు తీసుకొని వాటిలో కస్టర్డ్‌ పౌడర్‌ కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలలో పంచదార వేసి వేడి చేయాలి. కాసేపయ్యాక కస్టర్డ్‌ మిశ్రమం వేసి మళ్లీ మరిగించాలి.
మిశ్రమం స్టవ్‌పై నుంచి దింపుకొని కాస్త చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్‌, వెనీలా వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్టీల్‌ బాక్స్‌లోకి మార్చుకుని గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే... మ్యాంగో ఐస్‌క్రీమ్‌ రెడీ.

Updated Date - 2019-05-11T16:49:24+05:30 IST