కుకుంబర్‌ పీనట్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2019-06-01T20:12:38+05:30 IST

కీర - కిలో, పంచదార - టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొబ్బరి - అరకప్పు (తురిమినది), పల్లీలు - అరకప్పు (వేయించి పొడిచేసి పెట్టుకోవాలి), నిమ్మకాయ..

కుకుంబర్‌ పీనట్‌ సలాడ్‌

కావలసినవి
 
కీర - కిలో, పంచదార - టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొబ్బరి - అరకప్పు (తురిమినది), పల్లీలు - అరకప్పు (వేయించి పొడిచేసి పెట్టుకోవాలి), నిమ్మకాయ - ఒకటి, నెయ్యి - మూడు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - టీస్పూన్‌. ఇంగువ - పావు టీస్పూన్‌, మిరపకాయలు - మూడు(చిన్నగా కట్‌ చేసుకోవాలి).
 
తయారీవిధానం
 
కీర పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పెద్ద విత్తనాలు ఉంటే తీసేయాలి. వాటిని ఒక పాత్రలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టాలి. కీర ముక్కలు చల్లబడిన తరువాత కొబ్బరి తురుము, పంచదార కలుపుకోవాలి. పాన్‌ తీసుకుని నెయ్యి వేసి, వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ, మిర్చి వేసి వేగించాలి. తరువాత పాన్‌ తీసి పక్కన పెట్టి, చల్లారిన తరువాత దాన్ని కీర ముక్కలపై పోయాలి. చివరగా నిమ్మరసం, పల్లీల పొడి, తగినంత ఉప్పు చల్లుకుని వేడి వేడిగా తింటే బాగుంటుంది.

Updated Date - 2019-06-01T20:12:38+05:30 IST