Abn logo

స్వీట్‌కార్న్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావలసినవి
బియ్యం - ఒకకప్పు, నూనె - తగినంత, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, స్వీట్‌కార్న్‌ - ఒకకప్పు, క్యాప్సికం - ముప్పావు కప్పు, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒకకట్ట, మిరియాల పొడి - అరచెంచా, ఉప్పు - రుచికి తగినంత.
తయారీవిధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలి. అన్నం వండి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి. కాసేపయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత క్యాప్సికం, స్వీట్‌కార్న్‌ వేసి మరికాసేపు వేగించాలి. పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నం వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాసేపు ఉంచుకుని దింపుకోవాలి. స్వీట్‌కార్న్‌ ఫ్రైడ్‌ రైస్‌ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

రిమ్స్‌లో కలకలంసీజనల్‌ వ్యాధుల నివారణపై ముందస్తు చర్యలు తీసుకోవాలిఆదివాసీ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలిఢిల్లీలో బండి సంజయ్‌ని కలిసిన పటేల్‌ బీజేపీలో చేరిన రమేష్‌ రాథోడ్‌బాసర సెజ్‌ దిశగా కార్యాచరణజిల్లాలో సాగు పండుగ ప్రారంభంపరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేయాలిఅన్నిదానాల కంటే రక్తదానం గొప్పదిఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూలు
Advertisement
Advertisement