కొర్రల కిచిడీ

ABN , First Publish Date - 2019-05-25T20:19:50+05:30 IST

కొర్రలు - 100 గ్రా., పెసరపప్పు - 20 గ్రా., పచ్చి మిర్చి - 15 గ్రా., ఉల్లిపాయలు - 100 గ్రా., క్యారెట్లు

కొర్రల కిచిడీ

కావలసిన పదార్థాలు
 
కొర్రలు - 100 గ్రా., పెసరపప్పు - 20 గ్రా., పచ్చి మిర్చి - 15 గ్రా., ఉల్లిపాయలు - 100 గ్రా., క్యారెట్లు - 75 గ్రా., బంగాళ దుంపలు - 50 గ్రా., బీన్స్‌ - 20 గ్రా., టమాటాలు - 75 గ్రా., అల్లం - 5 గ్రా., చిన్న ఉల్లిపాయలు - 20 గ్రా., నూనె - 20 గ్రా., ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం
 
కుక్కర్‌లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్‌, బంగాళదుంపలు, బీన్స్‌, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. బాగా వేగాక 1:4 నిష్పత్తిలో నీరుపోసి, ఉప్పువేసి మరగనివ్వాలి. ఎసరు కాగాక ముందే కడిగి నానబెట్టిన పెసరపప్పు, కొర్రలు అందులో వేయాలి. కుక్కర్‌ మూత పెట్టి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉంచి దించేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తమీర వేసి వడ్డించాలి.
పోషక విలువలు: 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 309.74 కి.కెలోరీలు, ప్రొటీన్లు 8.35 గ్రా., కొవ్వు 16.18 గ్రా., కాల్షియం 53.11 మి.గ్రా., భాస్వరం 173.56 మి.గ్రా., ఇనుము 2.40 మి.గ్రా.

Updated Date - 2019-05-25T20:19:50+05:30 IST