మామిడికాయ రొయ్యల కూర

ABN , First Publish Date - 2019-09-07T18:57:33+05:30 IST

రొయ్యలు - పావుకేజీ, కొబ్బరి తురుము - అరకప్పు, చింతపండు - కొద్దిగా, పసుపు - ఒక టీస్పూన్‌, ఎండు మిర్చి - మూడు, ఉల్లిపాయ - ఒకటి, మామిడికాయ - ఒకటి

మామిడికాయ రొయ్యల కూర

కావలసినవి
 
రొయ్యలు - పావుకేజీ, కొబ్బరి తురుము - అరకప్పు, చింతపండు - కొద్దిగా, పసుపు - ఒక టీస్పూన్‌, ఎండు మిర్చి - మూడు, ఉల్లిపాయ - ఒకటి, మామిడికాయ - ఒకటి, నూనె - తగినంత, కారం - అర టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - అరటీస్పూన్‌, మెంతులు - పావు టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఽకొత్తిమీర - ఒకకట్ట, కొబ్బరి పాలు - ఒకకప్పు, కరివేపాకు - కొద్దిగా.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక అవాలు, మెంతులు వేయాలి. ఉల్లిపాయలు కూడా వేసి కాసేపు వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసి మరికాసేపు వేగనివ్వాలి. పసుపు, ధనియాల పొడి, కారం వేసి కలపాలి. తరువాత మామిడికాయ ముక్కలు, రొయ్యలు వేసి తగినంత ఉప్పు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కొబ్బరిపాలు పోయాలి. కావాలనుకుంటే అరకప్పు నీళ్లు పోసుకోవచ్చు. రొయ్యలు ఉడికిన తరువాత మిశ్రమం చిక్కబడుతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని దింపుకోవాలి.

Updated Date - 2019-09-07T18:57:33+05:30 IST