బొబ్బట్లు

ABN , First Publish Date - 2019-10-05T19:35:53+05:30 IST

రవ్వ - ఒక కప్పు, మైదా - రెండు కప్పులు, గోధుమ పిండి - అరకప్పు, పంచదార - రెండు కప్పులు, సోడా - చిటికెడు, నెయ్యి - రెండు టీస్పూన్లు, నూనె - సరిపడా.

బొబ్బట్లు

కావలసినవి
 
రవ్వ - ఒక కప్పు, మైదా - రెండు కప్పులు, గోధుమ పిండి - అరకప్పు, పంచదార - రెండు కప్పులు, సోడా - చిటికెడు, నెయ్యి - రెండు టీస్పూన్లు, నూనె - సరిపడా.
 
తయారీవిధానం
 
ముందుగా మైదా, గోధుమపిండి రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.వంట సోడా వేసి చపాతీ పిండిలా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నెయ్యి వేసి రవ్వను దోరగా వేగించాలి. ఒక మందపాటి పాత్రలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరుగుతుండగా వేగించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికిన తరవాత పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తుకుంటూ మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూ పూరీతో మూసేయాలి. తరువాత వాటిని చేత్తో బొబ్బట్టులా ఒత్తుకుంటూ పెనం మీద నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ.

Updated Date - 2019-10-05T19:35:53+05:30 IST