అరికల దోశ

ABN , First Publish Date - 2019-11-04T16:01:33+05:30 IST

అరికలు - 100 గ్రా., మినప పప్పు - 100 గ్రా., బియ్యం - 100 గ్రా., ఉప్పు - తగినంత, పుల్లపెరుగు - తగినంత.

అరికల దోశ

కావలసిన పదార్థాలు : అరికలు - 100 గ్రా., మినప పప్పు - 100 గ్రా., బియ్యం - 100 గ్రా., ఉప్పు - తగినంత, పుల్లపెరుగు - తగినంత.
 
తయారీ విధానం: అరికలు, మినప పప్పు, బియ్యం మూడింటిని కలిపి నానబెట్టాలి. తరువాత గ్రైండ్‌ చేసుకోవాలి. దీనిని ఒక రాత్రి అంతా నాననివ్వాలి. తరువాత రోజు పై మిశ్రమానికి ఉప్పు, పుల్లపెరుగు తగినంత జోడించి నీటితో పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద పెనం కాలిన తరువాత దోశ తిరగవేసి ఎర్రగా కాల్చాలి.
 
పోషక విలువలు : 100 గ్రాములు ఈ పదార్థంలో శక్తి 334 కి.కెలోరీలు, ప్రొటీన్లు 12.9 గ్రా., కొవ్వు 1.0 గ్రా., కాల్షియం 63.3 మి.గ్రా., భాస్వరం 238.6 మి.గ్రా., ఇనుము 1.7 మి.గ్రా.

Updated Date - 2019-11-04T16:01:33+05:30 IST