షాహీ మష్రూమ్‌

ABN , First Publish Date - 2019-10-19T18:42:43+05:30 IST

పుట్టగొడుగులు - పావుకిలో, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు. గరంమసాల కోసం : దాల్చినచెక్క - కొద్దిగా, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, మిరియాలు..

షాహీ మష్రూమ్‌

కావలసినవి
 
పుట్టగొడుగులు - పావుకిలో, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.
గరంమసాల కోసం : దాల్చినచెక్క - కొద్దిగా, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, మిరియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం - 10గ్రాములు, యాలకులు - రెండు, జాపత్రి - కొంచెం, ధనియాలు - అర టేబుల్‌స్పూన్‌, లవంగాలు - రెండు, జాజికాయ - కొంచెం.
 
గ్రేవీ కోసం: నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, జీలకర్ర - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, పసుపు - చిటికెడు, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, టొమాటో ప్యూరీ - పావుకిలో, పంచదార - చిటికెడు, జీడిపప్పు పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
ఒక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడయ్యాక పుట్టగొడుగులు, ఉప్పు వేసి వేగించాలి. బాగా వేగిన తరువాత ఒక పాత్రలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో గరంమసాల కోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగించాలి. తరువాత మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకో పాన్‌ తీసుకొని నెయ్యి వేసి కాస్త వేడయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ వేసి వేగించాలి. పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కాసేపు ఉడికిన తరువాత టొమాటో ప్యూరీ, కొంచెం పంచదార వేసి ఉడికించాలి. తర్వాత జీడిపప్పు పేస్టు, గరంమసాల, క్రీమ్‌ వేసి కలియబెట్టాలి. చివరగా పుట్టగొడుగులు వేసి చిన్నమంటపై కాసేపు ఉంచితే, షాహీ మష్రూమ్‌ రెడీ.

Updated Date - 2019-10-19T18:42:43+05:30 IST