సేవ్‌ పూరీ

ABN , First Publish Date - 2020-01-18T17:56:31+05:30 IST

పూరీలు లేదా పాపిడీలు - కొన్ని, కారప్పూస - అర కప్పు, బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పుదీనా చట్నీ - అరకప్పు, ఎండుమిర్చి చట్నీ - పావు కప్పు, స్వీట్‌

సేవ్‌ పూరీ

కావలసినవి: పూరీలు లేదా పాపిడీలు - కొన్ని, కారప్పూస - అర కప్పు,
బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పుదీనా చట్నీ - అరకప్పు, ఎండుమిర్చి చట్నీ - పావు కప్పు, స్వీట్‌ టామరిండ్‌ చట్నీ - అరకప్పు, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, చాట్‌ మసాలా - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, నిమ్మరసం - రెండు టీస్పూన్లు.
 
తయారీ: బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి.పూరీలు లేదా పాపిడీలు తీసుకోవాలి. వాటిపై బంగాళదుంప ముక్కలు వేయాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. టొమాటో ముక్కలు వేసి, చాట్‌ మసాలా చల్లాలి. ఇప్పుడు పుదీనా చట్నీ, ఎండుమిర్చి చట్నీ వేయాలి. ఎండుమిర్చి చట్నీ లేకపోతే కారం చల్లుకోవచ్చు. తరువాత స్వీట్‌ టామరిండ్‌ చట్నీ వేయాలి. కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఉప్పు, చాట్‌ మసాలా చల్లుకోవాలి. అంతగా సమంగా పడేలా కారప్పూస వేయాలి.చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-01-18T17:56:31+05:30 IST