మటన్‌ చాప్స్‌

ABN , First Publish Date - 2019-12-28T17:56:21+05:30 IST

మటన్‌ - ముప్పావు కిలో, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు, లవంగాలు - నాలుగైదు, మిరియాలు - కొన్ని, యాలకులు - నాలుగు, దాల్చినచెక్క - ఒక ముక్క, ఉల్లిపాయలు

మటన్‌ చాప్స్‌

కావలసిన పదార్థాలు: మటన్‌ - ముప్పావు కిలో, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు, లవంగాలు - నాలుగైదు, మిరియాలు - కొన్ని, యాలకులు - నాలుగు, దాల్చినచెక్క - ఒక ముక్క, ఉల్లిపాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, పసుపు - కొద్దిగా, కారం - ఒక టీస్పూన్‌, నిమ్మకాయ - ఒకటి, టొమాటో ప్యూరీ - అరకప్పు, గరంమసాలా - ఒకటిన్నర టీస్పూన్‌, పెరుగు - అరకప్పు, పుదీనా - ఒక కట్ట.
 
తయారీ విధానం: పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. కాసేపయ్యాక మటన్‌ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, పసుపు, కారం, నిమ్మరసం వేసి కలియబెట్టాలి. మూతపెట్టి పావుగంట ఉడికించాలి. టొమాటో ప్యూరీ వేసి మరికాసేపు ఉడకనివ్వాలి. గరంమసాలా, తగినంత ఉప్పు, పుదీనా, పెరుగు వేసి కలపాలి. కాసేపు ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకొని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి. వీటి రుచికి ఎవరైనా వహ్వా అనాల్సిందే.

Updated Date - 2019-12-28T17:56:21+05:30 IST