ఆలు సూప్‌

ABN , First Publish Date - 2015-08-26T21:59:24+05:30 IST

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 2, నీరు - 6 కప్పులు, బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - 1 కప్పు

ఆలు సూప్‌

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 2, నీరు - 6 కప్పులు, బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - 1 కప్పు, మెదిపిన లవంగాలు - 2, వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను, పాలు - అరకప్పు, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో నీరు, సన్నగా తరిగిన బంగాళదుంపల ముక్కలు వేసి స్టౌవ్‌ను సిమ్‌లో పెట్టి ఉడికించాలి. ఈలోపుగా మరో పాన్‌లో బటర్‌ వేసి ఉల్లి, వెల్లుల్లి తరుగు, మెదిపిన లవంగాలు వేగించి కార్న్‌ఫ్లోర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న బంగాళదుంపల్లో వేయాలి. 2 నిమిషాలయ్యాక పాలు కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. కాసేపయ్యాక ఉప్పు, మిరియాలపొడి వేసి దించేయాలి. ఈ సూప్‌ని వేడి వేడిగా తాగితే బాగుంటుంది. ఇష్టమైవాళ్లు బ్రెడ్‌ ముక్కలు సూప్‌లో వేసుకోవచ్చు.

Updated Date - 2015-08-26T21:59:24+05:30 IST