ఆలూ పరోటా

ABN , First Publish Date - 2015-08-26T21:55:59+05:30 IST

కావలసిన పదార్థాలు : గోధుమ పిండి - అర కేజీ, మైదా పిండి - అరకేజీ, బంగాళదుంపలు - అరకేజీ, ఉల్లిపాయలు - 2

ఆలూ పరోటా

కావలసిన పదార్థాలు : గోధుమ పిండి - అర కేజీ, మైదా పిండి - అరకేజీ, బంగాళదుంపలు - అరకేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిరపకాయలు - 4, క్యారెట్‌ - 2, అల్లం, వెల్లుల్లి ముద్ద - రెంచు చెంచాలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పసుపు - తగినంత.
తయారీ విధానం :
ఒక పాత్రలో గోధుమపిండి, మైదాపిండిలను కలిపి చపాతీ పిండిలా కలుపుకుని అరగంట పాటు నానబెట్టాలి. కుక్కర్‌లో బంగాళదుంపలను మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. ఇప్పుడో బాణలిలో నూనె వేసి కాగిన తరువాత పోపు వేసి దానిలో ఉల్లి, మిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఈ ముక్కలు వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి ముద్ద , క్యారెట్‌, పుదీనా, కొత్తిమీర వేసి అందులో బంగాళదుంప ముద్దవేసి బాగా కలిపి దించేయాలి. ఈ ముద్ద చల్లారిన తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలా కలిపి పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా చిన్నగా వత్తుకోవాలి. అలా వత్తుకున్న పూరీల మధ్యలో ఆలూ ముద్దను ఉంచి కూర బయటకు రాకుండా మడిచి చుట్టూ వత్తుకోవాలి. తరువాత వీటిని పెనంపై కాల్చుకుంటే ఆలూ పరోటా తయారైనట్టే.

Updated Date - 2015-08-26T21:55:59+05:30 IST