Abn logo

బీట్‌ రూట్‌ కజ్జికాయలు

కావలసిన పదార్థాలు: బీట్‌ రూట్‌ తురుము - 2 కప్పులు, క్యారెట్‌ తురుము - 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు, మైదా - 350 గ్రా., జీడిపప్పు, బాదం - పది చొప్పున, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, ఏలకుల పొడి - అర టీ స్పూను, పంచదార పొడి - రెండు కప్పులు, (కాచిన) పాలు - ఒకటిన్నర కప్పు, తేనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: మైదాలో 1 స్పూను నెయ్యి, తేనె, పాలు వేసి ముద్దలా కలుపుకోవాలి. కడాయిలో మిగతా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం వేగించి తీసేసి, అందులోనే బీట్‌రూట్‌, క్యారెట్‌, కొబ్బరి తురుము ఒకదాని తర్వాత ఒకటి వేగించాలి. ఒక పళ్లెంలో వేగించిన తురుములు, ఏలకుల పొడి, జీడిపప్పు, బాదం, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. మైదా ముద్దని ఉండలుగా చేసుకొని, పూరీల్లా వత్తుకోవాలి. పూరీల మధ్యలో తగినంత తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయల్లా వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి.


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

విస్తరిస్తున్న కరోనా సెగ

పల్లెలు భద్రమే!

ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే
Advertisement
d_article_rhs_ad_1

నవ్య