పొడి కాకర

ABN , First Publish Date - 2015-09-02T16:14:05+05:30 IST

పొడి కాకర

పొడి కాకర

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, శనగపప్పు - 100 గ్రా., ఉల్లిపాయలు - 200 గ్రా., ధనియాలు - 50 గ్రా., ఎండుమిర్చి - 5, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఎండుకొబ్బరి కోరు - 1 కప్పు, చింతపండు - పిడికెడు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: శనగపప్పు, ఉల్లిపాయలు, ధనియాలు, ఎండుమిర్చి నూనెలో దోరగా వేగించి (ఉల్లిపాయల్ని వేరుచేసి) పొడికొట్టాలి. తర్వాత ఉల్లిపాయలు, (పొడి) చింతపండు , ఉప్పు, ఎండుకొబ్బరికోరు వేసి మరికాసేపు దంచాలి. కడాయిలో నూనె వేసి సన్నగా తరిగిన కాకరను దోరగా వేగించి, తయారుచేసుకున్న పొడిని కలిపి మరో 5 నిమిషాల పాటు (సన్నని సెగమీద) ఉంచి దించేయాలి. ఈ పొడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-02T16:14:05+05:30 IST