మిల్లెట్‌ ఫుడ్డింగ్‌

ABN , First Publish Date - 2015-09-02T21:02:23+05:30 IST

కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు చిక్కటి పాలు - 1 లీటరు,

మిల్లెట్‌ ఫుడ్డింగ్‌

కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు చిక్కటి పాలు - 1 లీటరు, పంచదార - 100 గ్రాములు, బాదం, కిస్‌మిస్‌ - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, కొన్ని కుంకుమపువ్వు కాడలు.
తయారుచేసే విధానం: సజ్జల్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టి, ఆరబెట్టాలి. పొడిగా ఆరిన సజ్జల్ని మిక్సీలో నూకగా గ్రైండ్‌ చేసుకొని, చెరిగి, పొట్టుని వేరుచేయాలి. దళసరి పాత్రలో పాలు వేడిచేసి పొట్టుతీసిన సజ్జల్ని వేసి సన్నటి మంటపై మెత్తగా ఉడికించాలి. దించేముందు పంచదార వేసి కరిగించాలి. బాదం, కిస్‌మిస్‌, కుంకుమపువ్వుతో అలంకరించి వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా కూడా బాగుంటుంది.

Updated Date - 2015-09-02T21:02:23+05:30 IST