వంకాయ రసం

ABN , First Publish Date - 2015-09-02T20:59:00+05:30 IST

కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ - 1, టమోటో - 1, చింతపండు - నిమ్మకాయంత, కొత్తిమీర తరుగు

వంకాయ రసం

కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ - 1, టమోటో - 1, చింతపండు - నిమ్మకాయంత, కొత్తిమీర తరుగు - అలంకరణకు సరిపడా, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, దనియాలు - 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 3, ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - 1 టేబుల్‌ స్పూను; ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నెయ్యి - తిరగమోతకి సరిపడా.
తయారుచేసే విధానం: వంకాయకు నూనె రాసి మంటపైన కాల్చి మెదిపి పెట్టుకోవాలి. నూనెలో దనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి కొద్దిసేపు వేగించి పొడిచేసి చివర్లో అరముక్క టమోటా వేసి పేస్టులా రుబ్బుకోవాలి. కడాయిలో తాలింపు వేగాక పసుపు, చిదిమిన టమోటా ముక్క, రుబ్బుకున్న పేస్టు, మెదిపిన వంకాయ, చింతపండు గుజ్జు, ఉప్పు కలిపి రెండు నిమిషాల తర్వాత గ్లాసు నీరు పోయాలి. రసం రెండు పొంగులు వచ్చాక కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2015-09-02T20:59:00+05:30 IST