Abn logo

మొక్కజొన్న హల్వా

కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గుజ్జు - 1 కేజీ, (కండె నుండి వొలిచిన గింజల్ని ఉడికించి మిక్సీలో వేసుకోవాలి), పాలు - 1 లీటరు, కోవా - 200 గ్రా, పంచదార - 2 కప్పులు, నెయ్యి - 2 టీ స్పూన్లు, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌ల పలుకులు అరకప్పు, యాలకుల పొడి - అరకప్పు
తయారుచేసే విధానం: దళసరిగా ఉన్న పాత్రలో పాలతో పాటే మొక్కజొన్న గుజ్జు వేసి, పాలు ఇగిరిపోయే దాకా మరిగించాలి. అడుగంటకుండా కలుపుతుండాలి. పంచదారను కలిపి, యాలకుల పొడి వేసి 7 నిమిషాల పాటు పంచదార కరిగేదాకా గరిటతో తిప్పుతూ ఉండాలి. నెయ్యి, కోవా వేసి సన్నని సెగపైన నెయ్యి పైకి తేలేదాకా ఉంచి దించాలి. తయారైన హల్వాపైన నెయ్యిలో వేగించిన జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లతో అలంకరిస్తే చూడ్డానికి బాగుంటుంది.

నిపానిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు‘ఏస్సీ వర్గీకరణలో ప్రభుత్వాలు విఫలం’మంత్రి తలసాని దిష్టిబొమ్మ దహనంవివరాలు నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాలికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వ్యాక్సిన్‌కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్‌తో ముగింపు : ఎంపీకరోనా అంతం.. ఆరంభంభార్యపై భర్త గొడ్డలితో దాడిచెరువులో పడి బాలుడి మృతిఉరి వేసుకొని ఒకరి మృతి
Advertisement
Advertisement