సీతాఫలం ఫుడ్డింగ్‌

ABN , First Publish Date - 2015-10-09T15:33:43+05:30 IST

కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు- ఒకటిన్నర కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- 1 కప్పు, చైనా గ్రాస్‌- 10 గ్రాములు, పంచదార

సీతాఫలం ఫుడ్డింగ్‌

కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు- ఒకటిన్నర కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- 1 కప్పు, చైనా గ్రాస్‌- 10 గ్రాములు, పంచదార- 1/3 కప్పు.
తయారీ విధానం: చైనా గ్రాస్‌ను ఒక కప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీళ్ళతో సహా తక్కువ మంట మీద ఉంచి పూర్తిగా కరిగేవరకూ గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మరో గిన్నెలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోసి మరిగించి, పంచదార కూడా వేసి అది పూర్తిగా కరిగాక, ముందే మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసిన సీతాఫలం గుజ్జును వేయాలి. ఆ తరువాత ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ కరిగించి పెట్టుకున్న చైనా గ్రాస్‌ను కూడా వేసి మంట కట్టేయాలి. చల్లారాక చిన్న చిన్న గిన్నెల్లోకి తీసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తినాలి.

Updated Date - 2015-10-09T15:33:43+05:30 IST