కొత్తిమీర రోటి పచ్చడి

ABN , First Publish Date - 2015-12-03T16:01:43+05:30 IST

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - పది కట్టలు, పచ్చిమిరపకాయలు - ఎనిమిది, వెల్లుల్లి రేకలు - నాలుగు, ఆవాలు, - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఎండు

కొత్తిమీర రోటి పచ్చడి

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - పది కట్టలు, పచ్చిమిరపకాయలు - ఎనిమిది, వెల్లుల్లి రేకలు - నాలుగు, ఆవాలు, - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఎండు మిరపకాయలు - రెండు, కరివేపాకు - ఒక రెబ్బ, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద మరో గిన్నె పెట్టుకుని సరిపడా నూనె పోసి ఆవాలు,జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపులో పచ్చడి కలుపుకుంటే కొత్తిమీర రోటి పచ్చడి తయారయినట్టే.

Updated Date - 2015-12-03T16:01:43+05:30 IST