మామిడి రోటి పచ్చడి

ABN , First Publish Date - 2015-12-03T16:08:21+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడి కాయలు - రెండు, కొబ్బరి కాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఎనిమిది, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీ స్పూను,

మామిడి రోటి పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడి కాయలు - రెండు, కొబ్బరి కాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఎనిమిది, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీ స్పూను, ఎండుమిరపకాయలు - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మామిడికాయల్ని శుభ్రంగా కడిగి వస్త్రంతో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇందులో కొబ్బరి ముక్కలు కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకుని రోట్లో రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి కాగాక శెనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపుని పచ్చడిలో వేయాలి. అంతే మామిడికాయ, కొబ్బరి రోటి పచ్చడి రెడీ.

Updated Date - 2015-12-03T16:08:21+05:30 IST