పాల తాళికలు

ABN , First Publish Date - 2015-12-11T15:07:18+05:30 IST

కావలసిన పదార్థాలు : బియ్యం పిండి-పెద్ద గ్లాసు, పాలు-ఒక లీటరు, నీళ్ళు-ఒక లీటరు, సగ్గుబియ్యం-అర కప్పు, మైదాపిండి-అర కప్పు, బెల్లం-అర కిలో, పంచదార-ఒక కప్పు,

పాల తాళికలు

కావలసిన పదార్థాలు : బియ్యం పిండి-పెద్ద గ్లాసు, పాలు-ఒక లీటరు, నీళ్ళు-ఒక లీటరు, సగ్గుబియ్యం-అర కప్పు, మైదాపిండి-అర కప్పు, బెల్లం-అర కిలో, పంచదార-ఒక కప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌-50గ్రా, యాలకుల పొడి-ఒక టీస్పూన్‌, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : మందపాటి గిన్నె స్టవ్‌పై ఉంచి అందులో పాలు, నీళ్లు పోసి మరగనివ్వాలి. మరో గిన్నెలో బియ్యంపిండి, మైదాపిండి, ఒక స్పూను బెల్లం, కొంచెం ఉప్పు వేసి మరిగే పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి, చక్రాల గిద్దలతోగాని, పాలతాళికల మూకుడుతోగాని పిండిని వత్తాలి. ఆఖర్లో చక్రాల గిద్దల్లోగాని, మూకుడులోగాని మిగిలిన పిండిలో కాసినినీళ్లు పోసి బాగా కలిపి ఆ నీళ్లను కూడా దాంట్లోనే పోయాలి. బెల్లాన్ని మెత్తగా దంచి అందులో కప్పు పంచదార కలిపి, కప్పు నీల్లు పోసి తీగపాకం పట్టుకుని ఈ పాకాన్ని ఉడుకుతున్న పాల తాళికల గిన్నెలో పోసి యాలకుల పొడి వేయాలి. తినేటప్పుడు నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ పైన చల్లుకోవాలి.


Updated Date - 2015-12-11T15:07:18+05:30 IST