పంచదాన్యాల పొంగలి

ABN , First Publish Date - 2015-12-09T14:53:39+05:30 IST

కావలసిన పదార్థాలు : కొత్త బియ్యం-100గ్రా, రాగులు-100గ్రా, సజ్జలు-100గ్రా, గోధుమలు-100గ్రా, జొన్నలు-100గ్రా, బెల్లం-అర కిలో, సొంఠి పొడి-10గ్రా, యాలకుల

పంచదాన్యాల పొంగలి

కావలసిన పదార్థాలు : కొత్త బియ్యం-100గ్రా, రాగులు-100గ్రా, సజ్జలు-100గ్రా, గోధుమలు-100గ్రా, జొన్నలు-100గ్రా, బెల్లం-అర కిలో, సొంఠి పొడి-10గ్రా, యాలకుల పొడి-10గ్రా, జీడిపప్పు-50గ్రా, ఎండుద్రాక్ష-50గ్రా, సారపప్పు-20గ్రా, ఎండుకొబ్బరి ముక్కలు-20గ్రా, నల్ల నువ్వులు-50గ్రా, పాలు-అర లీటరు, నెయ్యి-తగినంత.
తయారుచేసే విధానం : ఈ పంచధాన్యాలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజంతా ఎండలో ఆరబెట్టాలి. తర్వాత వీటన్నింటినీ కలిపి రవ్వ మాదిరిగా మర వేయించి ఉంచుకోవాలి. ఈ రవ్వతోపాటు ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, సారపప్పును నేతిలో దోరగా వేయించి ఉంచుకోవాలి. ఒకపాత్రలో పాలు పోసి దాన్ని స్టవ్‌పై ఉంచి అందులో ఈ పంచధాన్యాల రవ్వను వేసి ఉడికించాలి. సగం ఉడికిన తర్వాత బెల్లం పొడి, నువ్వులు వేయాలి. పూర్తిగా ఉడికిన తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, సారపప్పు వేసి కలిపాలి. దించే ముందర యాలకులు, సొంఠి పొడి వేసి కలపాలి. ఈ పొంగలిలో తినేటప్పుడు మరికాస్త నెయ్యి కలుపుకోవచ్చు.

Updated Date - 2015-12-09T14:53:39+05:30 IST