సతాఫల్‌ రబ్డీ

ABN , First Publish Date - 2016-01-25T16:33:15+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు- ఒక లీటరు, చక్కెర- పావుకేజీ, సీతాఫలాలు- మూడు, కస్టర్డ్‌ పౌడర్‌- ఒకటేబుల్‌ స్పూను

సతాఫల్‌ రబ్డీ

కావలసిన పదార్థాలు: పాలు- ఒక లీటరు, చక్కెర- పావుకేజీ, సీతాఫలాలు- మూడు, కస్టర్డ్‌ పౌడర్‌- ఒకటేబుల్‌ స్పూను
తయారీ విధానం: ఒక గిన్నెలో పాలు పోసి చక్కెర వేసి మరిగించాలి. మరొక గిన్నెలో రెండు కప్పుల పాలు తీసుకొని దానిలో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి బాగా కలిపి ముందుగా కాగబెట్టిన పాలల్లో పోయాలి. ఈ పాలను మళ్లీ పావుగంటపాటు మరిగించి పక్కన పెట్టుకోవాలి. సీతాఫలంలో గింజలు తీసేసి కొద్దిగా పాలు పోసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే సీతాఫల్‌ రబ్డీ రెడీ...! ఆరు గంటల తరువాత ఫ్రిజ్‌లోంచి తీసి బాదంపప్పు చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2016-01-25T16:33:15+05:30 IST