శనగపప్పు స్వీట్‌

ABN , First Publish Date - 2015-09-03T17:50:58+05:30 IST

కావలసిన పదార్థాలు: శనగపప్పు - అర కప్పు, (1టేబుల్‌ స్పూను నూనె కలిపిన ) నీరు - అరకప్పు,

శనగపప్పు స్వీట్‌

కావలసిన పదార్థాలు: శనగపప్పు - అర కప్పు, (1టేబుల్‌ స్పూను నూనె కలిపిన ) నీరు - అరకప్పు, పాలు - అరకప్పు, నూనె - 1 టేబుల్‌ స్పూను, వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు, యాలకులపొడి - 1 టీ స్పూను, పంచదార - అరకప్పు, మిల్క్‌పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, పిస్తా ముక్కలు - అరకప్పు.
తయారుచేసే విధానం: నూనె కలిపిన నీటిలో శనగపప్పుని ఒక రాత్రంతా నానబెట్టి, ఆ నీళ్లతోనే ఉడికించి చేత్తో మెదపాలి. కడాయిలో నూనె, ఒక టేబుల్‌ స్పూను వెన్న వేసి నిమిషం తర్వాత మెదిపిన పప్పు, పాలు, యాలకులపొడి కలిపి అడుగంటకుండా 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పంచదార, మిల్క్‌పౌడర్‌, పిస్తా ముక్కలు వేయాలి. పంచదార పూర్తిగా కరిగాక వెన్న రాసిన ప్లేట్‌లో వేసి 2 గంటల తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. 

Updated Date - 2015-09-03T17:50:58+05:30 IST