సామల పాయసం

ABN , First Publish Date - 2016-08-08T21:09:19+05:30 IST

కావలసినవి: సామలు - పావు కప్పు, పాలు - రెండున్నర కప్పులు, కుంకుమపువ్వు తీగలు - కొన్ని, పంచదార - ముప్పావు కప్పు

సామల పాయసం

కావలసినవి: సామలు - పావు కప్పు, పాలు - రెండున్నర కప్పులు, కుంకుమపువ్వు తీగలు - కొన్ని, పంచదార - ముప్పావు కప్పు, బాదం, జీడిపప్పులు - ఒక్కోటి ఐదేసి (తరిగి), ఎండుద్రాక్షలు - ఐదు, యాలకలపొడి - పావు టీస్పూన్‌.
 
తయారీ: సామల్ని శుభ్రంగా కడిగి అవి మునిగేన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. తరువాత నీళ్లని వంపేయాలి. పాలను మందపాటి గిన్నెలో ఓ మాదిరి మంట మీద వేడిచేయాలి. అవి వేడెక్కాక నానబెట్టిన సామలు, కుంకుమపువ్వు తీగలు వేసి ఉడికించాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి. సామలు ఉడికేందుకు పది నుంచి పన్నెండు నిమిషాల సమయం పడుతుంది. అవి ఉడికాక పంచదార వేసి కలపాలి. ఆ తరువాత బాదం, జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్షలు, యాలకలపొడి వేసి కలపాలి. మరో రెండు నిమిషాలు ఉడికాక లేదా పాయసం కాస్త చిక్కగా అయ్యేంతవరకు ఉంచి స్టవ్‌ ఆపేయాలి. పాయసం సరిగా ఉడికిందా లేదా తెలుసుకునేందుకు స్పూన్‌లో పాయసం తీసుకుని జారిస్తే పాలు, సామలు ఒకేసారి కిందకు జారాలి. అలాకాని కాలేదంటే సన్నటి మంట మీద మరికాసేపు ఉడికించాలి. సామల పాయసాన్ని వేడివేడిగా లేదా చల్లగా తినొచ్చు. చల్లగా తినాలనుకుంటే కనుక పంచదార కలిపాక తక్కువసేపు ఉడికించాలి. అలాగే పాయసం చిక్కగా కాకూడదు.

Updated Date - 2016-08-08T21:09:19+05:30 IST