టమోటా మాల్‌పురి

ABN , First Publish Date - 2016-01-28T16:58:26+05:30 IST

కావలసిన పదార్థాలు: బెంగళూరు టమో టాలు-4, మైదాపిండి - ఒక కప్పు, బేకింగ్‌ పౌడర్‌- పావు టీ స్పూను, పాలు- ఒక టేబుల్‌ స్పూను, నెయ్యి- అర కప్పు, పచ్చికొబ్బరి కోరు - ఒక

టమోటా మాల్‌పురి

కావలసిన పదార్థాలు: బెంగళూరు టమో టాలు-4, మైదాపిండి - ఒక కప్పు, బేకింగ్‌ పౌడర్‌- పావు టీ స్పూను, పాలు- ఒక టేబుల్‌ స్పూను, నెయ్యి- అర కప్పు, పచ్చికొబ్బరి కోరు - ఒక కప్పు, యాలకులపొడి- కొద్దిగా, పంచదార పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు, కిస్‌మిస్‌లు, బాదంపలుకులు, జీడిపప్పు- కొద్దిగా
తయారీ విధానం: టమోటాలు వేడినీళ్ళలో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత తొక్క తీసి పండుని మిక్సీలో వేసి రుబ్బుకుని గుజ్జు తీసుకోవాలి. ఇందులో మైదాపిండి వేసి బాగా కలపాలి. పాలు, బేకింగ్‌ పౌడర్‌, పంచదార కూడా వేసి పిండిని జారుగా కలపాలి. ఇప్పుడు ఒక నానస్టిక్‌ పెనం పొయ్యి మీద పెట్టి గరిటతో పిండిని దోసెల్లా పోయాలి. దాని మీద నెయ్యి వేసి ఒకవైపు కాలాక తిరగేసి మళ్ళీ నెయ్యి వేసి కాల్చాలి. ఇలా అన్నీ చేసుకున్నాక ప్లేటులో పెట్టి మడతలు వేయాలి. వీటిపైన పచ్చి కొబ్బరి, కిస్‌మిస్‌లు, జీడిపప్పు, బాదంపప్పు, చెర్రీ పెడితే చూడడానికి అందంగా ఉండటమేకాక రుచిగా కూడా ఉంటాయి.ఞ

Updated Date - 2016-01-28T16:58:26+05:30 IST