రాగి అనాస ఖీర్‌

ABN , First Publish Date - 2015-09-02T23:58:52+05:30 IST

కావలసిన పదార్థాలు: రాగిపిండి - అరకప్పు, పాలు - 2 కప్పులు, బెల్లంపొడి - అరకప్పు,

రాగి అనాస ఖీర్‌

కావలసిన పదార్థాలు: రాగిపిండి - అరకప్పు, పాలు - 2 కప్పులు, బెల్లంపొడి - అరకప్పు, పండిన అనాస (ఫైనాపిల్‌) ముక్కలు - 1కప్పు, నేతిలో వేగించిన జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌ - ఐదేసి చొప్పున, యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: రాగిపిండిలో ఒక కప్పునీరు చేర్చి సన్నని మంటపై ఉండచుట్టకుండా (జావలా) కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలను మరిగించి దానిలో ఈ రాగిజావ, బెల్లం వేసి కొద్దిగా చిక్కబడనిచ్చి దించేయాలి. ఖీరు వేడి తగ్గాక అనాసముక్కలు, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌, యాలకులపొడి వేసి కలపాలి. మంచి పోషకవిలువలున్న తియ్యతియ్యని ఈ ఖీరును ఎవరైనా ఇష్టపడతారు.

Updated Date - 2015-09-02T23:58:52+05:30 IST