క్యారెట్‌ బెల్‌ పెప్పర్‌ సూప్‌

ABN , First Publish Date - 2016-01-23T15:50:01+05:30 IST

కావలసినవి: క్యారెట్‌, రెడ్‌ క్యాప్సికమ్‌, గ్రీన్‌ క్యాప్సికమ్‌, టొమాటో- అరకప్పు చొప్పున, ఎండుమిర్చిగింజలు, లవంగాలు, యాలకలు- అరటీస్పూను చొప్పున, మిరియాలు- పావుటీస్పూను. ఉప్పు- తగినంత.

క్యారెట్‌ బెల్‌ పెప్పర్‌ సూప్‌

కావలసినవి:  క్యారెట్‌, రెడ్‌ క్యాప్సికమ్‌, గ్రీన్‌ క్యాప్సికమ్‌, టొమాటో- అరకప్పు చొప్పున, ఎండుమిర్చిగింజలు, లవంగాలు, యాలకలు- అరటీస్పూను చొప్పున, మిరియాలు- పావుటీస్పూను. ఉప్పు- తగినంత.

తయారీ:  
ఒక గిన్నెలో క్యారెట్‌, క్యాప్సికం, టొమాటోలు ముక్కలు వేసి రెండు కప్పులు నీళ్లు పోసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. స్టవ్‌ ఆపేసాక ముక్కల్ని మెత్తగా మెదపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసుకొని ఎండుమిర్చి గింజలు, లంవంగాలు, యాలకలు, ఉప్పు, మిరియాలు వేసి పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నమంటపై రెండు నిమిషాలపాటు ఉడికించి స్టవ్‌ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2016-01-23T15:50:01+05:30 IST