మంచూరియా సూప్‌

ABN , First Publish Date - 2015-11-04T14:27:19+05:30 IST

కావలసిన పదార్థాలు : ఉల్లిపాయ ముక్కలు-రెండు టేబుల్‌స్పూన్లు, క్యాబేజి తురుము-

మంచూరియా సూప్‌

కావలసిన పదార్థాలు : ఉల్లిపాయ ముక్కలు-రెండు టేబుల్‌స్పూన్లు, క్యాబేజి తురుము-ఒక కప, క్యారట్‌ తురుము -అర కప్పు, పుదీనా-అర టీస్పూన్‌, నీళ్లు-రెండు కప్పులు, మైదాపిండి-పావు కప్పు, కార్న్‌ఫ్లోర్‌-రెండు టేబుల్‌స్పూన్లు, సోయాసాస్‌-రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాల పొడి-అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు-అర టీస్పూన్‌, బటర్‌(వెన్న) -ఒక టీ స్పూన్‌, చిల్లీసాస్‌-పావు టీస్పూన్‌, ఉప్పు-రుచికి తగినంత, వంటసోడా-చిటికెడు.
తయారు చేసే విధానం : ఒక గిన్నెలో క్యాబేజి తరుము, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, చిల్లీసాస్‌, సోయాసాస్‌, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత అందులో మైదాపిండి, కార్న్‌ఫ్లోర్‌ కూడా వేసి తగినంత నీరు పోసి గట్టిగా ఉండే విధంగా కలిపి ఉంచుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె పోసి అది వేడెక్కాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేగించాలి. మరో బాణలిలో కొద్దిగా బటర్‌ వేసి అది వేడెక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత కొద్దిగా సోయాసాస్‌, చిల్లీసాస్‌ వేసి ఒక్క నిమిషం వేగించి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి. మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో కలపాలి. సూప్‌ కాస్త చిక్కబడిన తరువాత దించి అందులో మిరియాల పొడి కలపాలి. ఆపైన వేగించి పెట్టుకున్న మంచూరియా బాల్స్‌ వేసి మరో ఐదు నిమిషాలు స్టవ్‌పై ఉడికించి దించేయాలి. సూప్‌ వేడిగా ఉన్నప్పుడే బవుల్‌లో పోసి పైన కొత్తిమీర, సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-11-04T14:27:19+05:30 IST