బుడ్డకాకర రసం

ABN , First Publish Date - 2017-03-04T15:42:21+05:30 IST

లీచీ, గంగరేగు చెట్లు ఈ జాతికి చెందినవే. మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు ఉంటే

బుడ్డకాకర రసం

ఒంటినొప్పులు తగ్గించే.. బుడ్డకాకర

లీచీ, గంగరేగు చెట్లు ఈ జాతికి చెందినవే. మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు ఉంటే ఈ ఆకులతో చేసిన రసం చాలా బాగా పనిచేస్తుంది. ఆముదం నూనెలో వేగించిన ఈ ఆకుల్ని ఒక బట్టముక్కలో చుట్టి, కీళ్ల నొప్పులున్న దగ్గర కాపడం పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మొక్క నుంచి తీసిన సారం కార్టిలేజ్‌ (మృదులాస్థి), టెండాన్‌, ఎముకల త్వచాలను రక్షిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఆర్థరైటిస్‌ చికిత్సలో దీన్ని వాడతారు. ఈ మొక్క పై భాగాల నుంచి తీసిన సారంలో ఎనాల్జిసిక్‌ ధర్మాలు ఉంటాయి. అంటే మనం వాడే అల్లోపతి మందుల్లోని మార్ఫిన్‌, పారాసెట్‌మాల్‌ మాత్రలు ఎలా పనిచేస్తాయో అలాంటి ధర్మాలు అన్నమాట. గొంతు ఇన్ఫెక్షన్‌, తలనొప్పులకి కూడా ఇది ఉపయుక్తం. చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఆకుల రసం చెవినొప్పికి వాడతారు.
 
బుడ్డకాకర రసం
కావలసిన పదార్థాలు
బుడ్డకాకర ఆకులు - గుప్పెడు, చింతపండు రసం - ఒక లీటర్‌, ఎండుమిర్చి - కొన్ని, మిరియాలు, జీలకర్ర, ఉప్పు - సరిపడినంత, ఇంగువ - చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది, ఆవాలు, నూనె - తాలింపునకు.
 
తయారీ విధానం
బుడ్డకాకర ఆకుల్ని శుభ్రంగా కడిగి చింతపండు రసంలో వేయాలి. ఒక టీస్పూన్‌ ఉప్పు వేసి చింతపండు పచ్చి వాసనపోయే వరకు ఉడికించాలి. ఎండుమిర్చిలు మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పట్టి రసంలో కలపాలి. తరువాత మిరియాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. రసం ఉడుకు పట్టగానే స్టవ్‌ ఆపేయాలి. ఆవాలతో తాలింపు వేయాలి. ఈ రసం తాగినప్పుడల్లా ఒక్కో గ్లాసు చొప్పున తీసుకుంటే ఫలితం ఉంటుంది.

Updated Date - 2017-03-04T15:42:21+05:30 IST