ఆలూ జమూన్‌

ABN , First Publish Date - 2015-08-26T22:06:22+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు - 2, పంచదార- 1 కప్పు, నీరు - 1 కప్పు, మైదా - 2 టీ స్పూన్లు

ఆలూ జమూన్‌

కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు - 2, పంచదార- 1 కప్పు, నీరు - 1 కప్పు, మైదా - 2 టీ స్పూన్లు, యాలకుల పొడి - 1 టీ స్పూను, వేగించడానికి నూనె.
తయారుచేసే విధానం
ఉడికించిన బంగాళదుంపల్ని మెత్తగా చిదిమి అందులో యాలకులపొడి, మైదా వేసి బాగా కలుపుకుని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో బంగారు రంగు వచ్చేలా వేగించి ఉంచుకోవాలి. కప్పు నీటిలో పంచదార వేసి తీగపాకం వచ్చేక వేగించి ఉంచుకున్న బంగాళదుంపల ఉండల్ని అందులో వేయాలి. గులాబ్‌జామ్‌ల్లా ఉబ్బి తినడానికి బాగుంటాయి.

Updated Date - 2015-08-26T22:06:22+05:30 IST