సేమియా మంచూరియా

ABN , First Publish Date - 2015-11-16T15:28:25+05:30 IST

కావలసిన పదార్థాలు : సేమియా-1 కప్పు, బంగాళదుంపలు-2, అల్లం వెల్లుల్లి పేస్ట్‌-2 స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్‌-1 స్పూను, టమాటాలు-2, ఉల్లిపాయలు-2, గరం మసాలా-1

సేమియా మంచూరియా

కావలసిన పదార్థాలు : సేమియా-1 కప్పు, బంగాళదుంపలు-2, అల్లం వెల్లుల్లి పేస్ట్‌-2 స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్‌-1 స్పూను, టమాటాలు-2, ఉల్లిపాయలు-2, గరం మసాలా-1 స్పూను, మొక్కజొన్న పిండి-3 స్పూన్లు, కారం- అర స్పూను, ఉప్పు-తగినంత, కొత్తిమీర-కొద్దిగా..
తయారుచేసే విధానం : ముందు సేమియాను మంచినీటిలో ఉడికించాలి. ఉడికిన తరువాత నీళ్లు వడగట్టి సేమియాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బంగాళదుంపలను ఉడికించి తొక్కు తీసేయాలి. ఒక గిన్నెలో ఉడికిన సేమియాను, బంగాళదుంపలను వేసి మెత్తగా పిసకాలి. అందులోనే తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి పేస్ట్‌, మొక్కజొన్న పిండి ఒక స్పూన్‌ వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. మరో గిన్నెలో కొద్దిగా మొక్కజొన్న పిండి వేసి, అందులో నీరు పోసి పిండి చిక్కగా అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్‌ మీద బాణలి ఉంచి, అందులో కొంత నూనె పోసి, అది బాగా వేడెక్కాక.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండల్ని ఈ మొక్కజొన్న పిండిలో ముంచి బాణలిలో వేసి ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించాలి.
మరొక బాణలి స్టవ్‌ మీద ఉంచి, అందులో కొద్దిగా నూనె వేసి, పోపు గింజలు, ఆనక టమాట పేస్టు, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొంచెం సేపు వేపాలి. వేయించిన ఉండలను ఇందులో వేసి, తగినంత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. కర్రీ చిక్కబడిన తరువాత దింపేసి, మరో గిన్నెలోకి మార్చుకుని, పైన కొత్తిమీర ఆకులు చల్లితే చాలు.. సేమియా మంచూరియా రెడీ అయినట్లే! వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-11-16T15:28:25+05:30 IST