వెజ్‌ మంచూరియా

ABN , First Publish Date - 2015-08-30T21:36:03+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యాబేజీ - 100గ్రా., క్యారెట్‌ - అరముక్క, ఉల్లికాడలు - 2, మైదా - 1 టేబుల్‌ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి - 1 టీ స్పూన్‌,

వెజ్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు: క్యాబేజీ - 100గ్రా., క్యారెట్‌ - అరముక్క, ఉల్లికాడలు - 2, మైదా - 1 టేబుల్‌ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి - 1 టీ స్పూన్‌, పచ్చిమిర్చి - 1, ఉప్పు - రుచికి, నూనె - వేగించడానికి. అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, క్యాప్సికం తరుము - 1 టేబుల్‌ స్పూను చొప్పున, సోయా సాస్‌ - 2 టీ స్పూన్లు, పంచదార - చిటికెడు, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను, తెల్ల మిరియాల పొడి - చిటికెడు, ఉప్పు - రుచికి, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో నూనె తప్పించి మిగతా పదార్థాలన్నీ వేసి ముద్ద చేయాలి. తర్వాత 8 భాగాలు చేసి గుంత పొంగనాల పెనంపై వేగించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, క్యాప్సికం తరుగు వేగించాలి. సోయా సాస్‌, పంచదార, ఉప్పు, కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ వేసి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరుపోయాలి. చిక్కబడ్డాక ఉల్లికాడల తరుగుతో పాటు బాల్స్‌ కూడా వేసి మునిగేలా ఉంచాలి.

Updated Date - 2015-08-30T21:36:03+05:30 IST