బ్రౌన్‌ రైస్‌ పులావ్‌

ABN , First Publish Date - 2019-09-28T18:40:18+05:30 IST

వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, నూనె - తగినంత, దాల్చిన చెక్క పొడి - అర టీస్పూన్‌, పంచదార - చిటికెడు, బ్రౌన్‌రై్‌స - ఒకటిన్నర కప్పు, బంగాళదుంప..

బ్రౌన్‌ రైస్‌ పులావ్‌

కావలసినవి
 
వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, నూనె - తగినంత, దాల్చిన చెక్క పొడి - అర టీస్పూన్‌, పంచదార - చిటికెడు, బ్రౌన్‌రై్‌స - ఒకటిన్నర కప్పు, బంగాళదుంప - ఒకటి, వెజిటబుల్స్‌ స్టాక్‌ - మూడున్నర కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - కొద్దిగా.
 
తయారీవిధానం
 
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె, కొద్దిగా వెన్న వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు, దాల్చినచెక్క పొడి, బంగాళదుంప ముక్కలు, పంచదార వేసి వేగించుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోయాలి. ఉప్పు, మిరియాల పొడి వేయాలి. వెజిటబుల్‌ స్టాక్‌ వేసి కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. అంతే.. బ్రౌన్‌ రైస్‌ పులావ్‌ రెడీ.

Updated Date - 2019-09-28T18:40:18+05:30 IST